: ఆనాడే అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు... కానీ, కేసీఆర్ కూడా మాట్లాడలేదు!


పార్లమెంటులో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై హాట్ హాట్ గా చర్చ జరుగుతున్నప్పుడే... గవర్నర్ విశేష అధికారాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ క్లియర్ గా చెప్పారు. అయినా, ఆనాడు సభలో ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా ఎవరూ ఆయన మాటలను పట్టించుకోలేదు, గవర్నర్ అధికారాలపై మాట్లాడలేదు. అప్పుడు అసద్ ఏం హెచ్చరించారో... ఇప్పుడు అదే జరుగుతోంది. అసలు ఆరోజు సభలో అసద్ ఏమి చెప్పారంటే.... "ఎలాగైనా తెలంగాణ సాధించాలనే నిరాశ, నిస్పృహలో తెలంగాణ వాదులు ఉన్నారు. తెలంగాణ బిల్లును యథాతథంగా ఆమోదిస్తున్నారు. భవిష్యత్తులో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో వారు ఊహించే ప్రయత్నం చేయడం లేదు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు అధికారాలను కట్టబెట్టడాన్ని ఆమోదించరాదు. విభజన బిల్లు అమల్లోకి వస్తే... కేవలం ఎనిమిదిన్నర జిల్లాలపైనే సీఎంకు అధికారం ఉంటుంది. మిగిలిన ఒకటిన్నర జిల్లాలపై గవర్నర్ అధికారం చెలాయిస్తారు. కీలకమైన హైదరాబాదులో సీఎంకు అధికారాలు ఉండవు" అని నిండు సభలో అసద్ వివరించారు. కానీ, ఆనాడు ఆయన మాటను ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే జరగబోతోంది!

  • Loading...

More Telugu News