: ఏపీ నూతన రాజధాని... ఏదైనా పెద్ద నగరానికి సమీపంలోనే ఉంటుంది
ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రమైన కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల రాజధాని విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న ఏదైనా పెద్ద నగరానికి సమీపంలోనే నూతన రాజధాని ఉంటే బాగుంటుందన్న అభిప్రాయానికి టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతమున్న ఏదైనా పెద్ద నగరానికి 40 కిలోమీటర్ల పరిధిలో నూతన రాజధాని ఉంటే... చాలా సౌలభ్యంగా ఉంటుందనే భావనకు ఏపీ మంత్రి మండలి వచ్చింది. సమీపంలో పెద్ద నగరం లేేకుంటే... కొత్త రాజధాని ప్రణాళిక సరిగ్గా అమలు కాదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే... నెలరోజుల్లోపు రాజధాని ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం అనుకుంటోంది.