: గవర్నర్ నరసింహన్ కు ఉద్వాసన?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు ఉద్వాసన ఖాయంలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నప్పటికీ... నరసింహన్ మాత్రం మెతక వైఖరితో వ్యవహరిస్తున్నారని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. నరసింహన్ వైఖరితో సమస్యలు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయన్న అంచనాకు వచ్చింది. హైదరాబాదుపై అధికారాలు గవర్నర్ కు కట్టబెట్టాలని భావిస్తున్న తరుణంలో... నరసింహన్ సరైన రీతిలో పాలించలేరని కేంద్రం యోచిస్తోందని సమాచారం. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, గవర్నర్ గా నరసింహన్ ను తొలగించి... ఆయన స్థానంలో దీటైన వ్యక్తిని నియమించాలనే భావనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.