: మా ఆదేశాలు పాటించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు: టీఎస్ సర్కారుకు కేంద్రం హెచ్చరిక


హైదరాబాదుపై గవర్నరుకు అధికారాలు కట్టబెట్టడానికి అంగీకరించమని తెలంగాణ సర్కార్ రాసిన లేఖ కేంద్ర హోంశాఖకు చేరింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్ గా తీసుకుందని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ కు బాధ్యతలు అప్పగించే అంశం విభజన చట్టంలో క్లియర్ గా ఉందని తెలిపింది. తమ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం ఆచరించాల్సిందేనని... లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనవసరంగా కొరివితో తల గోక్కుంటున్నారని హోంశాఖ అధికారులు కామెంట్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News