: ఇలాగైతే మరో ఉద్యమం తప్పదు: ఈటెల
హైదరాబాదు శాంతిభద్రతల పర్యవేక్షణను గవర్నర్ చేతిలో పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై టీఎస్ మంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో కేంద్రం తలదూర్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అన్ని రాష్ట్రాల సీఎంలను ఏకం చేస్తామని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే... మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.