: ప్రజల ఆకాంక్ష మేరకే ప్రసారాలను నిలిపివేశాం: వరంగల్ ఎంఎస్ఓల సంఘం అధ్యక్షుడు
ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేశామని వరంగల్ ఎంఎస్ఓల సంఘం అధ్యక్షుడు కోటేశ్వర్ తెలిపారు. కేబుల్ చట్టాలకు లోబడే తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. తమపై ప్రభుత్వ ఒత్తిడి లేదని అన్నారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి జవదేకర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.