: ప్రజల మధ్య విభేదాలకు కేసీఆరే కారణం: కేఈ


ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విభేదాలకు టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. కుట్రపూరిత రాజకీయాలతో ఆయన ఇరు ప్రాంత ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని కోరారు. ఇకనైనా ఆంధ్ర ప్రజలతో తెలంగాణ వారు సఖ్యతతో మెలగడానికి ప్రయత్నించాలని సూచించారు. కర్నూలును ఆంధ్రప్రదేశ్ రాజధాని చేయాలని కోరుతూ... ఈ నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామని ఆయన తెలిపారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News