: బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం: నాయిని
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద ఇవాళ ఉదయం జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి సికింద్రాబాదు యశోదా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆసుపత్రికి 22 మంది చిన్నారులను తీసుకురాగా, ఇద్దరు మరణించారని ఆయన అన్నారు. మిగతా 20 మందికి ఎంత ఖర్చైనా ప్రభుత్వం తరఫున వైద్యం చేయిస్తామని చెప్పారు. పిల్లలంతా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారని తెలిపారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత రైల్వేశాఖదేనన్నారు. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద గేటు ఏర్పాటు చేయలేదని... ఇంతకు ముందు ద్విచక్ర వాహనదారులు మరణించిన సందర్భాలున్నా రైల్వే శాఖ అక్కడ గేటును ఏర్పాటు చేయలేదని నాయిని మండిపడ్డారు.