: ప్రపంచ రెజ్లింగ్ పోటీలకు దూరంగా ఉండాలనుకుంటున్న సుశీల్, యోగేశ్వర్


వచ్చే నెల (సెప్టెంబర్)లో జరగనున్న ఫిలా ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ కు ప్రముఖ భారత రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ లు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. త్వరలో జరగనున్న ఆసియన్ గేమ్స్ ను దృష్టిలో ఉంచుకునే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉజ్బెకిస్తాన్ లోని తాష్కెంట్ లో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఏదైనా గాయాల బారిన పడితే... వాటి ప్రభావం ఆసియన్ గేమ్స్ పై పడుతుందని వారు భావిస్తున్నారు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో వీరిద్దరూ స్వర్ణ పతకాలు సాధించారు.

  • Loading...

More Telugu News