: ఇది ముమ్మాటికీ చంద్రబాబు, వెంకయ్యల కుట్రే: హరీష్ రావు
హైదరాబాద్ నగర శాంతిభద్రతలను గవర్నర్ కు అప్పగించే విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఈ విషయంపై టీఎస్ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుల కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను యూపీఏ ప్రభుత్వం కాలరాస్తోందంటూ గతంలో ఆరోపించిన ప్రధాని మోడీ... ఇప్పుడు అదే పని ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో కుటుంబ సమగ్ర సర్వే సన్నాహక సమావేశంలో ఈ రోజు హరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.