: హైదరాబాద్ లో భూటాన్ యువరాజు


భూటాన్ యువరాజు జిగ్మే వాంగ్ చుక్ నేడు హైదరాబాద్ విచ్చేశారు. ఇక్కడి యాప్రాల్ లో ఉన్న లేక్ లైన్ షూటింగ్ రేంజిని తన పర్యటనలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతోన్న జాతీయ షూటింగ్ పోటీలను వీక్షించారు. అక్కడ బిగ్ బోర్ రైఫిల్ చేతపట్టిన భూటాన్ యువరాజు కాసేపు సరదాగా షూటింగ్ ప్రాక్టీసు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తమ దేశంలో ఫుట్ బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, స్నూకర్ వంటి క్రీడలు బాగా ప్రాచుర్యం పొందాయని, షూటింగ్ కూ ఇక ప్రాధాన్యం కల్పిస్తామని వాంగ్ చుక్ అన్నారు. భారత్ ను ఆదర్శంగా తీసుకుని షూటింగ్ అంశంలో ఒలింపిక్స్ స్థాయికి ఎదిగేందుకు శ్రమిస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News