: అమిత్ షా వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు: పీఎం మోడీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితుడైన అమిత్ షాకు పార్టీ జాతీయ మండలి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. వ్యక్తిగతంగా షా గురించి తనకు బాగా తెలుసునన్నారు. ప్రస్తుత బాధ్యతలను ఆయన సమర్ధవంతంగా నిర్వహించగలరని చెప్పారు. అమిత్ షానే లేకుంటే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి అన్ని సీట్లు వచ్చేవి కావన్నారు. అటు దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలమంది కార్యకర్తలు కూడా పార్టీ విజయం కోసం అవిశ్రాంత కృషి చేశారని ప్రశంసించారు. బీజేపీ అనే జట్టుకు ఈసారి ఎన్నికల్లో కెప్టెన్ రాజ్ నాథ్ సింగ్ అయితే, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అమిత్ షా అని విశ్లేషించారు.