: జనసంఘ్ తోనే మా రాజకీయ జీవితం ప్రారంభం: ఎల్ కే అద్వానీ


ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ మండలి సమావేశంలో పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీ సుదీర్ఘంగా ప్రసంగించారు. జనసంఘ్ తోనే తమ రాజకీయ జీవితం ప్రారంభమైందని, అక్కడ ప్రారంభమైన ప్రయాణం ఈరోజు ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. సంఘ్ పరివార్ ద్వారానే బీజేపీకి దశ, దిశానిర్దేశం జరిగిందన్నారు. అయితే, సంఘ్ పరివార్ రాజకీయ అస్తిత్వం కాదని, ఒక పరిపూర్ణ ఆలోచనా విధానం అని తెలిపారు. ఈ క్రమంలో 1951 లో పార్టీ ఆవిర్భావానికి బీజాలు పడ్డాయని... కానీ, అప్పట్లో పార్టీ ప్రభావం ఒక్క పశ్చిమ బెంగాల్ లోనే ఉండేదన్నారు. ఎందరో త్యాగధనులు పార్టీకి తమ జీవితాలను పణంగా పెట్టారని అద్వానీ గుర్తు చేశారు. బీజేపీలో వ్యక్తుల మధ్య భావ సంఘర్షణ జరిగేదని, అంతిమంగా అందరి భావన మాత్రం నవభారతమేనని అద్వానీ చెప్పారు. స్వతంత్ర భారత చరిత్రలో 2014 ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవని... ఈ విజయం నరేంద్రమోడీ వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. అంత గొప్ప విజయం సాధించినా ఆయనలో ఇసుమంతైనా గర్వం అన్నది లేదని అభిప్రాయపడ్డారు. కాగా, బీజేపీలో ఇంతటి క్రమశిక్షణను తానెన్నడూ చూడలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News