: ఉమ్మడి హైదరాబాదులో గవర్నర్ అధికారాలు అమలుచేయలేం: తెలంగాణ స్టేట్
ఉమ్మడి హైదరాబాదులో గవర్నర్ దే అధికారమంటూ కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలో గవర్నర్ పాలనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈరోజు కేంద్రానికి తిరుగు లేఖ రాశారు. హైదరాబాదులో గవర్నర్ అధికారాలు అమలు చేయడం సాధ్యం కాదని లేఖలో పేర్కొన్నారు. మంత్రుల సలహాలు, సంప్రదింపుల మేరకే గవర్నర్ పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. గవర్నర్ కు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అప్పగించలేమని, రాష్ట్రం విషయంలో కేంద్రం జోక్యం తగదని సీఎస్ లేఖలో పేర్కొన్నారు.