: గన్నవరంలోనే ఇన్ స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐ అండ్ సీ (ఇన్ స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్) ను గన్నవరంలోనే నిర్మించనున్నారు. ఐ అండ్ సీ సెంటర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రవాణాశాఖ మంత్రి సిద్దా రాఘవరావు, ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గన్నవరంలో ఉన్న అనుకూలతలు, స్థల లబ్ది తదితర సమగ్ర వివరాలతో కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖకు లేఖ రాయనున్నారని సమాచారం. ఈ సెంటర్ ద్వారా తక్కువ సమయంలో వాహనాల ఫిట్ నెస్ తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.

  • Loading...

More Telugu News