: హైదరాబాదుపై కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని ఒప్పుకోం: రాజయ్య
హైదరాబాదుపై కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. తక్షణమే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణపై పెత్తనం చెలాయించాలని కేంద్రం చూస్తే... పెద్ద ఎత్తున మరో ఉద్యమానికి సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. ఈ నెల 19న జరిగే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి హన్మకొండలో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సదస్సుకు జిల్లాలోని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు.