: కేంద్రం రెండు లక్షలా?... రాష్ట్రమే ఐదు లక్షలు ఇస్తోంది!: జితేందర్ రెడ్డి
మెదక్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతులకు కేంద్రం రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించడంపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ పరిసరాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే ఐదు లక్షల రూపాయల పరిహారం అందజేస్తుందని అలాంటిది, కేంద్రం రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించడం సరికాదని అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు మృతి చెందితే వారి తల్లిదండ్రులకు మరింత భరోసా ఇవ్వాలని ఆయన సూచించారు. దీనిపై రైల్వే శాఖ మంత్రి మాట్లాడుతూ, తాము అందించే పరిహారమే వారికి న్యాయం చేయదని రైల్వే శాఖ ఏం చేస్తుందో చూడాలని ఆయన పేర్కొన్నారు.