: ఇబ్బందులు ఎదురైనా రుణమాఫీ చేస్తాం: యనమల
రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇబ్బందులు ఎదురైనా రైతు రుణమాఫీని చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రూ. 45 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘనత తెలుగుదేశానిదేనని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం విపక్షాలకు ఇష్టం లేదని యనమల అన్నారు. ఆర్ బీఐ తాజాగా నాలుగు జిల్లాల్లో మాత్రమే రుణాలను రీషెడ్యూలు చేస్తామని ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.