: ఐదు కోట్ల విలువైన శంఖం టాస్క్ ఫోర్స్ పోలీసుల స్వాధీనం


శంఖం ఏంటి... ఐదు కోట్ల విలువేంటి... అని ఆశ్చర్యపోతున్నారా? వివరాల్లోకి వెళితే... ఐదుగురు దొంగల ముఠా విలువైన శంఖాన్ని అపహరించి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు హైదరాబాదు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో, ఓ ప్లాన్ ప్రకారం కొనుగోలుదారులుగా పోలీసులే వ్యవహరించి సికింద్రాబాద్ బొల్లారం రావాలని దొంగల ముఠాకు చెప్పారు. పోలీసులు చెప్పిన ప్రాంతానికి దొంగలు రాగానే... వారిని అరెస్టుచేసి విలువైన శంఖాన్ని స్వాధీనం చేసుకున్నారు. శంఖం ఖరీదు దాదాపు ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందని భావిస్తున్నారు. బొల్లారం పరిసర ప్రాంతాల్లో ఈ వార్త కలకలం రేపింది.

  • Loading...

More Telugu News