: మథుర మ్యూజియంలో క్వీన్ విక్టోరియా విగ్రహాలు ధ్వంసం
మథుర మ్యూజియంలో ఉన్న ఇంగ్లండ్ మాజీ రాణి విక్టోరియా మూడు విగ్రహాలు ధ్వంసమయ్యాయని మ్యూజియం అధికారులు తెలిపారు. రెండొందల ఏళ్ల నాటి ఆ విగ్రహాలను మ్యూజియంలోని క్వీన్ విక్టోరియా పార్క్ లో పెట్టేందుకు వాటిని తెచ్చారని, ప్రస్తుతం దానికి సంబంధించిన పని ఇంకా జరుగుతోందని చెప్పారు. అయితే, నిన్న (శుక్రవారం) మ్యూజియంకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో ఇద్దరిని పట్టుకున్నామని, మూడో వ్యక్తి తప్పించుకున్నట్లు వారు వివరించారు.