: బీజేపీ అధ్యక్ష పదవికి అమిత్ షా సరిపోయే వ్యక్తి: రాజ్ నాథ్ సింగ్


బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి అమిత్ షాను ఆమోదించిన నేపథ్యంలో... షాను పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ మేరకు పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి జాతీయ మండలి సమావేశంలో రాజ్ నాథ్ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి 71 లోక్ సభ సీట్లు తెచ్చిపెట్టిన నేపథ్యంలో, పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి అమిత్ షా సరిగ్గా సరిపోయే వ్యక్తని పేర్కొన్నారు. యూపీలో పార్టీ సాధించిన భారీ విజయం క్రెడిట్ అతనికే వెళ్లాలని, తొలిసారే ఆ రాష్ట్రంలో బీజేపీకి అంతటి మెజారిటీ దక్కడం విశేషమన్నారు. అందుకే ఇక నుంచి పార్టీ పనిని షాకు అప్పగిస్తున్నానని చెప్పారు. మోడీ, షా నేతృత్వంలో దేశం మళ్లీ 'జగత్ గురు'లా వర్ధిల్లుతుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News