: ఒంగోలులో క్విట్ ఇండియా డే
ప్రకాశం జిల్లా ఒంగోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్విట్ ఇండియా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్విట్ ఇండియా పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరంలో అసువులు బాసిన ఉద్యమకారుల స్పూర్తిపథాన్ని కొనసాగించాలనే ధ్యేయంతోనే కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా దినోత్సవాన్ని నిర్వహిస్తోందని అన్నారు.