: తెలంగాణ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదు: పొంగులేటి
గాంధీభవన్లో కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో దయచేసి ఆటలాడుకోవద్దని ఆయన హితవు పలికారు. నియంతృత్వ ధోరణితో ముందుకు పోవడం కేసీఆర్ కు మంచిది కాదని పొంగులేటి అన్నారు.