: అమరావతిని మింగేస్తున్న ఇసుక మాఫియా


గుంటూరు జిల్లా అమరావతిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ ఏడాది నిర్వహించిన వేలంలో ఏడు బోట్స్ మెన్ సొసైటీలు రీచ్ లను దక్కించుకున్నాయి. ఎలాంటి యంత్రాలను ఉపయోగించకుండా నదీ తీరంలోని ఇసుకను తవ్వాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, డ్రెడ్జర్లతో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తున్నారు. నదికి అడ్డంగా ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. నకిలీ వే బిల్లులతో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తున్నారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో నీటి కష్టాలు తప్పవని నిపుణులు అంటున్నారు.

  • Loading...

More Telugu News