: ప్రధాని మోడీకి ద్వారకా పీఠ్ శంకరాచార్య హెచ్చరిక


వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తున్న ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని హెచ్చరించారు. త్వరలో షిరిడీ సాయిబాబాను మోడీ దర్శించుకోబోతున్నారన్న వార్తల నేపథ్యంలో... దర్శనానికి వస్తే ఏం జరుగుతుందోనన్నారు. ఈ క్రమంలో మోడీ తన షిరిడీ పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేసిన స్వరూపానంద... దర్శనానికి వస్తే ఆయనకు (మోడీకి) దేవతల నుంచి రక్షణ ఉండదన్నారు. అయితే, మోడీతో తనకెలాంటి సమస్యల్లేవన్నారు. కానీ, తలపై క్యాప్ ధరించి సమాధి వద్ద ప్రార్థనలు చేసేందుకు తిరస్కరించే వ్యక్తి షిరిడీ ఎలా వస్తారని ఆయన అన్నారు. సాయిబాబాను దర్శించుకునేందుకు షిరిడీ రావాలంటూ శివసేన ఎంపీ ఒకరు ప్రధాని మోడీని ఆహ్వానించారు. వెంటనే ఈ ఆహ్వానాన్ని ప్రధాని అంగీకరించారని, త్వరలో సాయిని దర్శించుకుంటారని సమాచారం.

  • Loading...

More Telugu News