: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్ కోడెల
తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కోడెలకు జేఈవో శ్రీనివాసరావు స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు. స్పీకరును శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.