: కారుతో గోక్కున్న ఏనుగు... అప్పడమైన కారు


ఆఫ్రికన్ దేశాల్లో టూరిస్టులు సఫారీకి వెళుతుంటారు. విహారం కోసం, సాహస క్రీడల పేరిట అడవుల్లో ఇలా సఫారీ చేయడం ఓ కొత్త అనుభూతి. వీటికి మంచి ఆదరణ కూడా ఉంది. ఆఫ్రికా, మరికొన్ని దేశాల అడవుల్లో టూరిజం, సాహస యాత్రల పేరుతో విదేశీ మారకాన్ని భారీగానే పోగేసుకుంటున్నాయి. దక్షిణాఫ్రికాలోని పిలానెస్ బర్గ్ పార్క్ లో చోటు చేసుకున్న సంఘటన తాలూకు ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అడవి జంతువుల్ని చూసేందుకు కారులో కొంత మంది పర్యాటకులు బయల్దేరారు. వారి వెంట గైడ్ కమ్ డ్రైవర్ కూడా ఉన్నాడు. పిలానెస్ బర్గ్ పార్క్ లో కారు జంతువుల్ని చూసుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఆఫ్రికా ఏనుగు కారు దగ్గరగా వచ్చింది. దాని భీకరాకారాన్ని చూసిన పర్యాటకులు ఆనందంతో కేరింతలు కొట్టారు. మాంఛి మూడ్ లో ఉన్న గజరాజుగారు కారు దగ్గరకొచ్చి కారుతో పొట్ట గోక్కున్నారు. దురద తీరిందో ఏమో కానీ కాసేపటి తరువాత కారుపై నుంచి లేచి నెమ్మదిగా నడ్డి ఊపుకుంటూ వెళ్లిపోయారు. కారుపై ఏనుగు కూర్చోవడంతో టాప్ అప్పడమైపోయింది. నాలుగు టైర్లు పగిలిపోయాయి. కారు బాడీ బెండైపోయింది. దీంతో బతుకు జీవుడా అంటూ పర్యాటకులు ఇళ్లు చేరారు.

  • Loading...

More Telugu News