: బీబీనగర్ లో దోపిడీ దొంగల బీభత్సం


నల్గొండ జిల్లా బీబీనగర్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్రవారం అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు నగదు, నగలు అపహరించారు. అడ్డుకోబోయిన దంపతులపై మారణాయుధాలతో దాడికి దిగారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త జానీ పాషాకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం భువనగిరి ఆసుపత్రికి తరలించారు. దోపిడీ దొంగల బీభత్సంతో భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News