: ఐదు లక్షల రూపాయలతో అమ్మవారికి అలంకరణ
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా హైదరాబాదులోని పలు ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలోని ఆలయంలో భ్రమరాంబ దేవిని 5 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. సరూర్ నగర్ వాసవీ నగర్ లోని అష్టలక్ష్మీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దాదాపు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని కొన్ని దేవాలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. తెలుగింటి ఆడపడుచులు వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అష్ట ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారిని కోరుకున్నారు.