: సంతాపంగా రేపు మెదక్ జిల్లా పాఠశాలలకు సెలవు
రేపు మెదక్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ రోజు జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు విద్యార్థులు మృత్యువాత పడటంతో... సంతాప సూచకంగా సెలవు ప్రకటించినట్టు డీఈవో తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని... స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.