: మోడీ గారూ! మా ప్రతినిధుల సభలో ప్రసంగించండి: అమెరికా ఆహ్వానం
అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా ఆహ్వానించింది. వాషింగ్టన్ లో ప్రతినిధుల సభ స్పీకర్ జాన్ బోయ్ నర్ మోడీకి లేఖ రాశారు. మోడీ పర్యటన సమయంలో సంయుక్త సమావేశాలను పొడిగిస్తామని ఆయన లేఖలో పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు మోడీని ఆహ్వానించాలని ప్రతినిధుల సభ సభ్యులు, సెనేటర్లు స్పీకరుకు ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. నవంబర్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉభయసభలు సమావేశమయ్యే అవకాశం లేనందున, ప్రతినిధుల సభ సభ్యులు, సెనేటర్లు ఎన్నికల ప్రచారంలో ఉండడం కారణంగా మోడీ ప్రసంగం ఉండకపోవచ్చని వార్తలు వెలువడిన నేపథ్యంలో... ప్రతినిధుల సభ స్పీకర్ నరేంద్ర మోడీకి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.