: ప్రమాదానికి గురైన బస్సులో ఎంతమంది చిన్నారులు ఉన్నారు?
మెదక్ జిల్లా మాసాయిపేట సమీపంలో ఇవాళ ఉదయం స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో... ఎంతమంది చిన్నారులు మరణించారన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటన జరిగినప్పుడు బస్సు డ్రైవర్, క్లీనర్ తో పాటు 13 మంది పిల్లలు చనిపోయారని అధికారులు చెబుతున్నారు. కానీ, ఘటనా స్థలం నుంచి అందిన సమాచారం మేరకు 20 మంది చిన్నారులు చనిపోయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరికొంతమంది తుదిశ్వాస విడిచారు. మరో 23 మంది పిల్లలు సికింద్రాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తొలుత బస్సులో 30 మంది చిన్నారులున్నారని వార్తలొచ్చాయి. కానీ, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బస్సులో 40 మందికి పైగా పిల్లలున్నట్లు తెలుస్తోంది.