: 'దొంగ' దెయ్యానికి జరిమానా విధించిన కోర్టు


జనాన్ని భయపెట్టిన ఒక దొంగ 'దెయ్యానికి' లండన్ న్యాయస్థానం జరిమానా వేసింది. బ్రిటన్ కు చెందిన ఆంటోనీ స్టాలార్డ్ మిత్రునితో కలిసి ఫుట్ బాల్ ఆడుతున్నాడు. ఇంతలో పక్కనున్న పోర్ట్స్ మౌత్ లోని కింగ్ స్టన్ శ్మశానవాటికలో తమ ఆప్తులకు నివాళులర్పించేందుకు కొందరు వచ్చారు. దీంతో అతనికి ఓ చిలిపి ఆలోచన వచ్చింది. వారందర్నీ భయపెడితే ఎలా ఉంటుందని అనుకున్న స్టాలార్డ్ వెనక్కి నడుస్తూ దెయ్యంలాగ శబ్దాలను చేశాడు. అంతే... శ్మశానవాటిక ఖాళీ అయిపోయింది. భయభ్రాంతులకు గురైన జనం పోతూ పోతూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దెయ్యం సంగతేంటో చూద్దామని వచ్చిన పోలీసులకు స్టాలార్డ్ కనిపించాడు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని, పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఇటీవలే ఈ కేసును విచారించిన కోర్టు ఇంకెప్పుడూ ప్రజలను భయపెట్టవద్దంటూ ఆదేశిస్తూ, అతనికి 75 పౌండ్ల జరిమానా విధించింది. ఇందులో 20 పౌండ్లను బాధితులకు, మరో 20 పౌండ్లను కోర్టు ఖర్చులకు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

  • Loading...

More Telugu News