: ములుగు గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్
మెదక్ జిల్లా ములుగు గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. జగదేవ్ పూర్ మండలంలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాదు నగరానికి వెళ్తూ... కేసీఆర్ మార్గమధ్యంలో ఆగారు. గ్రామంలో ఉన్న పరిస్థితుల గురించి ఆయన స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ములుగులోని ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ లో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ శరత్ తో పాటు జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు.