: ఉత్సాహంగా సాగిన ఐఐటీ హైదరాబాద్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఐఐటీ హైదరాబాదు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో సాగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పట్టాలు అందజేశారు. పట్టాలు అందుకున్న విద్యార్థులను చూసి తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందుకున్న విద్యార్థుల కేరింతలతో ఐఐటీ ప్రాంగణం మార్మోగింది.