: రైతును 'యూస్ లెస్ ఫెలో' అన్న చంద్రబాబునాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి విశాఖ యాత్రలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. చంద్రబాబునాయుడు రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఓ రైతు రుణమాఫీ ఎప్పటికి పూర్తవుతుంది. రైతులకు రుణాలు ఎప్పటికి మంజూరు చేస్తారు అంటూ ప్రశ్నించాడు. దీంతో ముఖ్యమంత్రికి ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. "ఏయ్... యూస్ లెస్ ఫెలో... ముందు విను" అంటూ కసురుకున్నారు. 'ఒక్కరు అరిచినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, పది మంది మాట్లాడితే అప్పుడు సమస్య పరిష్కారమవుతుంద'ని సూచించారు. దీంతో ఆ రైతు అవాక్కై అక్కడ్నుంచి మెల్లగా జారుకున్నాడు.