: వరలక్ష్మి వ్రతంతో కళకళలాడిన తెలుగు లోగిళ్లు


శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెలుగు లోగిళ్లు కళకళలాడాయి. తెలుగింటి ఆడపడుచులు వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కృష్ణాజిల్లాలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారు వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. విజయవాడలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమంలో భాగంగా టీటీడీ కల్యాణ మండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలాచరించారు. భద్రాద్రి రామాలయంలో ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి సమీపంలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆస్థాన మండపంలో జరిగిన వరలక్ష్మి పూజకు హాజరైన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఖమ్మం, సంగారెడ్డి, వరంగల్, నల్గొండతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోనూ వరలక్ష్మి వ్రతం వేడుకలు ఘనంగా జరిగాయి.

  • Loading...

More Telugu News