: సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఉండదు: పాపిరెడ్డి
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాతే తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్ పై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్ పై సోమవారానికి ఓ స్పష్టత వచ్చే అవకాశముందని అన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం అయింది. రెండు రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్ల మధ్య ఉన్న విభేదాల కారణంగా కౌన్సెలింగ్ ఊపందుకోలేదు. ఎంసెట్ పై నిర్ణయం ఆలస్యం కావడంతో చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదువుకునేందుకు వెళ్లిపోవడం కూడా కౌన్సిలింగ్ మందకొడిగా సాగడానికి కారణమవుతోంది.