: నేను రాజ్యసభకు రాకపోవడానికి కారణాలున్నాయి: సచిన్
రాజ్యసభకు హాజరుకాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ముంబైలో సచిన్ టెండూల్కర్ వివరణ ఇస్తూ, తనకు అత్యున్నత సభపై అగౌరవ భావం లేదని అన్నాడు. తన కుటుంబ బాధ్యతల నేపథ్యంలో తాను ఢిల్లీలో లేనని తెలిపాడు. తన పెద్దన్నయ్యకు బైపాస్ సర్జరీ అయిన కారణంగా ఆయనను దగ్గరుండి చూసుకున్నానని వెల్లడించాడు. ఢిల్లీలో లేని కారణంగా తాను రాజ్యసభ సమావేశాలకు హాజరుకాలేకపోయానని సచిన్ స్పష్టం చేశాడు.