: సినిమా షూటింగులో గాయపడిన బాలకృష్ణ
టాలీవుడ్ ప్రముఖ హీరో బాలకృష్ణ సినిమా షూటింగులో గాయపడ్డారు. హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డుపై బైక్ రేసింగ్ షూటింగ్ చేస్తుండగా ఆయన కాలికి గాయమైంది. దీంతో ఆయనను హుటాహుటిన ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆయన గాయాన్ని పరిశీలించిన వైద్యులు గాయం స్వల్పమైనదేనని, విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో షూటింగ్ నిలిపేశారు. ఆయన కోలుకున్న తరువాత షూటింగ్ తిరిగి కొనసాగుతుంది.