: ఆధిక్యంలో ఇంగ్లండ్ 201/6
మాంచెస్టర్ లో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ దే పైచేయిగా నిలిచింది. ఓపికగా ఆడిన ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ లో బాలెన్స్ (37), బెల్ (58) పరుగులు చేయగా... రూట్ (23), బట్లర్ (13) పరుగులతో క్రీజులో ఉన్నారు. బారత బౌలర్లలో వరుణ్ ఆరోన్, భువనేశ్వర్ కుమార్ చెరో మూడు వికెట్లు తీసి రాణించారు. దీంతో రెండో రోజు లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఇంకా రెండున్నర రోజుల ఆట మిగిలి ఉంది.