: ఆరుషిని చంపింది తల్లిదండ్రులే అంటోన్న సీబీఐ


సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో అసలు దోషులు ఆమె తల్లిదండ్రులే అని సీబీఐ నేడు కోర్టులో తన వాదనలను బలంగా వినిపించింది. ఐదేళ్ళ క్రితం ఘజియాబాద్ లో టీనేజర్ ఆరుషి మరణించినపుడు ఆమె తల్లిదండ్రులు నూపుర్ తల్వార్, రాజేష్ తల్వార్ లు మాత్రమే ఇంటిలో ఉన్నారని, మరో వ్యక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించే అవకాశం లేదని సీబీఐ కోర్టుకు స్పష్టంగా తెలియజేసింది. కాగా, అదే సమయంలో వారి పనిమనిషి హేమరాజ్ కూడా మృతి చెందాడు. ఈ రెండు హత్యలు తల్వార్ దంపతుల పనే అని కేసు దర్యాప్తు చేస్తున్న ఏజీఎల్ కౌల్ తెలిపారు. ఆయన ఈకేసులో 39వ సాక్షిగా ఉన్నారు.

ఆరుషి, హేమరాజ్ లను చంపడానికి తల్వార్ దంపతులు గోల్ఫ్ క్లబ్ ను, సర్జికల్ నైఫ్ ను ఉపయోగించారని కౌల్ వెల్లడించారు. అయితే, ఈ కేసులో తాము అమాయకులమని ఆరుషి తల్లిదండ్రులంటున్నారు.

  • Loading...

More Telugu News