: చరణ్ టీజర్ అద్భుతంగా ఉందన్న తమ్ముడు


రామ్ చరణ్ తేజ్ తాజా సినిమా 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా టీజర్ పై అతని తమ్ముడు స్పందించాడు. రామ్ చరణ్ తమ్ముడెవరనుకుంటున్నారా? కొణిదెల కుటుంబం నుంచి వెండితెరకు కొత్తగా పరిచయం అవుతున్న వరుణ్ తేజ్! వరుణ్ తేజ్ నాగబాబు తనయుడన్న విషయం తెలిసిందే. "చరణ్ అన్న 'గోవిందుడు అందరి వాడేలే'తో వస్తున్నాడు. టీజర్ అద్భుతంగా రంగుల హరివిల్లులా ఉంది. సినిమా ఎప్పుడు చూస్తానా అని ఆతృతతో ఎదురుచూస్తున్నా" అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News