: మాటల్లో స్వర్గం, చేతల్లో నరకం చూపిస్తున్నారు...కేసీఆర్ ది తుగ్లక్ పాలన: ఎర్రబెల్లి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తుగ్లక్ పాలనను గుర్తుచేస్తున్నారని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎంసెట్ కౌన్సిలింగ్, ఫీజు రీయింబర్స్ మెంట్ విషయాల్లో తెలంగాణ విద్యార్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని అన్నారు. సమగ్ర సర్వే ఒక్క రోజులో సాధ్యం కాదన్న ఆయన ఇందుకు వారం రోజుల సమయం తీసుకోవాలని సూచించారు. కేసీఆర్ మాటల్లో స్వర్గం, చేతల్లో నరకం చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ చేతకానితనం వల్లే రాష్ట్రంలో కరెంట్ కష్టాలొచ్చాయని ఆయన మండిపడ్డారు. అధికారంలోకొస్తే 8 గంటల నిరంతరాయ విద్యుత్ ఇస్తామని చెప్పి, సొంత జిల్లాలోనే రైతులను పోలీసులతో కొట్టించారని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News