: లోక్ సభలో నిర్మలా సీతారామన్ తమిళ సమాధానం


లోక్ సభలో తమిళంలో అడిగిన ప్రశ్నకు ఓ కేంద్ర మంత్రి తిరిగి తమిళంలోనే సమాధానం ఇవ్వడం బహుశా ఇదే తొలిసారి అయి ఉండవచ్చు. జన్మతః తమిళనాడుకు చెందిన కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు కుటుంబానికి చెందిన పరకాల ప్రభాకర్ ను వివాహం చేసుకున్నారన్న సంగతి తెలిసిందే. కాగా, లోక్ సభలో ఈరోజు (శుక్రవారం) ఏఐడీఎంకే సభ్యుడు టి.రాధాకృష్ణన్ అడిగిన అనుబంధ ప్రశ్నకు స్పీకర్ అనుమతి మేరకు ఆమె తమిళంలోనే సమాధానం ఇవ్వడం విశేషం. చైనా నుంచి అక్రమంగా తరలిస్తున్న క్రాకర్స్ వల్ల దేశంలో వాటికి బాగా పేరుగాంచిన తమిళనాడులోని శివకాశీలో దేశీయ పరిశ్రమ పూర్తిగా నష్టపోతుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అక్కడే దేశం మొత్తంలో మందుగుండు సామగ్రికి డిమాండ్ ఉందన్నారు. దీనిపై ఇప్పటికే సీఎం జయలలిత కేంద్రానికి రాసిన లేఖను ఈ సందర్భంగా ఉటంకించిన సదరు సభ్యుడు ఎలాంటి చర్య తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్రాన్ని కోరారు. ఆ సమయంలో మంత్రి నిర్మలా సీతారామన్ పైవిధంగా స్పందించారు. ఆ వెంటనే మిగతా సభ్యులు బల్లలు చరిచారు. అటు సభలో ముందు వరసలో కూర్చున్న మంత్రి అరుణ్ జైట్లీ ఇదంతా జరుగుతున్నప్పుడు చిరునవ్వుతో కనిపించారు.

  • Loading...

More Telugu News