: టీఆర్ఎస్ నన్ను ఇబ్బంది పెడితే... టీఆర్ఎస్ ను నేను ఇబ్బంది పెడతా: దానం


తనపై టీఆర్ఎస్ ఆశలు వదులుకోవాల్సిందే అని మాజీ మంత్రి దానం నాగేందర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తనకు పార్టీ మారే ఆలోచన లేదని అన్నారు. పార్టీ మారడం లేదని తనను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూస్తే తాను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతానని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తెలంగాణ ప్రజలే కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని దానం తెలిపారు. సమగ్ర సర్వేలో ఆటో డ్రైవర్లు, కూలీల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. విధులు మానేయాలన్న ప్రభుత్వం ఆ రోజు అందరికీ సెలవు ప్రకటించినట్టు సర్వేలో పాల్గొన్న వారందరికీ భత్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News