: ఎర్రచందనాన్ని వేలం వేయనున్న ఏపీ ఫ్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనాన్ని వేలం వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు ఎర్రచందనం దుంగలను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తుంది. 4,160 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని వేలం ద్వారా అమ్మడానికి సిద్ధం చేస్తోంది. గ్లోబల్ టెండర్ల ద్వారా దీనిని విక్రయించనుంది. వేలంలో పాల్గొనే వారికి ఈ నెల 11 నుంచి ఎర్రచందనం దుంగలను తనిఖీ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కడప, బాకరాపేట, తిరుపతి, ఉదయగిరి, నెల్లూరు, వెంకటగిరిలో ఈ అమ్మకాలు జరుపనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.