: ఎంఎస్ఓల లైసెన్సులు రద్దు చేస్తాం: ప్రకాశ్ జవదేకర్
ఎందరో మహానుభావులు చేసిన పోరాటాల ఫలితంగానే భావప్రకటన స్వేచ్ఛ వచ్చిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, స్వేచ్ఛలో హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని అన్నారు. భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన తెలిపారు. మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ స్వేచ్ఛలో బాధ్యతలు కూడా ఉంటాయని మీడియా గుర్తించాలని ఆయన సూచించారు. మీడియా స్వయం నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు. నేటి సాయంత్రం 5 గంటలకు ఎంఎస్ఓలతో సమావేశం ఏర్పాటు చేయనున్నామని. అందులో ఎవరైనా మీడియాపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తే వారిని నిషేధిస్తామని అన్నారు. 47 సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుని ఎంఎస్ఓల లైసెన్స్ రద్దు చేస్తామని ఆయన చెప్పారు. వెంటనే వారిపై క్రిమినల్ సెక్షన్లపై చర్యతీసుకుంటామని జవదేకర్ స్పష్టం చేశారు.