: ఎబొలా కారణంగా ప్రపంచవ్యాప్త ఎమర్జెన్సీ ప్రకటించిన 'హూ'


ఎబోలా వైరస్ కారణంగా పశ్చిమ ఆఫ్రికాలో పెద్ద ఎత్తున ప్రాణాలు హరించుకుపోతున్న నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచవ్యాప్త ఎమర్జెన్సీ ప్రకటించింది. అంతేగాకుండా, ప్రస్తుతం ఎబొలా వైరస్ ప్రభావిత దేశాలకు సాయం చేయాలంటూ సభ్య దేశాలకు సూచించింది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి 1000 మందికిపైగా మరణించారు. ముఖ్యంగా లైబీరియా, సియెర్రా లియోన్ వంటి దేశాల్లో ఎబొలా అత్యధికులను బలిగొన్నది. ప్రస్తుతం ఈ మహమ్మారి నియంత్రిత స్థితి దాటిపోయిందన్న హెచ్చరికల నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News