: నాకు నేనుగా టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయను: కనుమూరి
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి నుంచి తనకు తానుగా దిగిపోనని ఎంపీ కనుమూరి బాపిరాజు అంటున్నారు. టీటీడీ ఛైర్మన్ పదవి చాలా పవిత్రమైనదని, తానుగా రాజీనామా చేయనని ఆయన తేల్చి చెప్పారు. నూతన పాలకమండలి ఏర్పడే వరకు పదవిలో కొనసాగుతానని మీడియా ముఖంగా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారన్నారు. దైవకృపతో వచ్చిన పదవికి రాజీనామా చేసేందుకు సాహసించలేకపోతున్నానని కనుమూరి పేర్కొన్నారు.